Papers by S M S RAO DASARI
Bringing together two classical ideas on art and literature, this paper attempts to make a compar... more Bringing together two classical ideas on art and literature, this paper attempts to make a comparative study of Bharata's theory of rasa and Longinus' theory of sublimity. The two theories from two different time and space are compared in this paper because, their object of treatment is literature or literary performance. For Bharata, it is natya and for Longinus it is poetry, the two classical forms of literary reflections of the creative genius.
Drafts by S M S RAO DASARI

Arunatara, 2018
దళిత కథా – కథానిక పూర్వరంగం
ఈ దేశంలో, రాజ్యాంగపరమైన రక్షణలు - సౌకర్యాలు సమకూరిన తర్వాత ఇక్కడి ... more దళిత కథా – కథానిక పూర్వరంగం
ఈ దేశంలో, రాజ్యాంగపరమైన రక్షణలు - సౌకర్యాలు సమకూరిన తర్వాత ఇక్కడి కుల వ్యవస్థలో నిన్న స్థాయిలో ఉన్న కులాలు , వాటి శాఖలు - వాటికి బయట నుండే ఇతర తెగలు క్రమంగా విద్యావకాశాలను ఉపయోగించుకోవడం ప్రారంభించాయి. అతి తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, ఈ నిమ్నకులాల యువకులు విద్యావంతులై జీవితంలోని విభిన్న రంగాలలో పని చేయడం మొదలుపెట్టారు. మొదలు ఈ కింది తెగల విద్యావంతులైన యువకుల ఉనికినే గుర్తించడం జరగలేదు. ప్రత్యేకించి ఈనాటికి గ్రామాల్లో ఈ నిర్లక్ష్యం ఘోరంగా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ఈ నిమ్నవర్గాల చదువుకున్న యువకులు నగరాలకు, బస్తీలకు పట్నాలకు చేరుకున్నారు. ఇక్కడ వాళ్ళకున్న అతి ముఖ్యమైన సౌకర్యం ఒక్కటే ఏదో ఒక రోజు వారి వృత్తి లేదా ఉద్యోగం ఇక్కడ స్థిరనివాసం ఏర్పడిన తర్వాత ఈ యువకులు తమ గ్రామాల నుంచి సంబంధాలు తెగి జీవించడమో లేదా తమ ఉనికి కోసం పోరాటం చేయడమో కొనసాగిస్తారు. ఇక ఉనికి కోసం జరిగే పోరాట రూపాలు విభిన్నమైనవి. అందులో ముఖ్యమైనది రాజకీయ అధికారం కోసం వేరే ప్రయత్నం పార్లమెంటు, శాసనసభలో ఉన్న రిజర్వ స్థానాల కోసం వీళ్ళు జరుపుతున్న ఎన్నికల పరమైన పోరాటం ఒకవైపు - ఇందులో వ్యక్తిగతమైన స్వార్థమే అత్యధికం. అధికారాన్ని చేజిక్కించుకుని మారుమూల గ్రామాల్లో అన్యాయాన్ని - దౌర్జన్యాన్ని నిశ్శబ్దంగా భరించే తమ సోదరులను స్వాభిమానంతో జీవించేలా చేయాలని సౌకర్యాల కోసం జరిగే ప్రయత్నం స్వల్పమైనదే - ఇది ఒక వాస్తవం ఇలాంటి రాజకీయ పరమైన పోరాటాలు విలువల దృష్ట్యా కేవలం రాజీ ధోరణిలోనే ఉండిపోయాయి. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తిత్వం దీనికి మినహాయింపు. ఆయన తర్వాత మాత్రం దళిత వర్గాల నాయకత్వం కోసం వచ్చిన వాళ్లు దాదాపు అందరూ తమ వర్గంలోని వాళ్లను కేవలం “ఓటర్లు” గానే భావించి రాజకీయాల్లోకి దిగారు.
పోరాటంలోని మరో దిశ ఆర్థిక రంగానికి సంబంధించినది. కనీస సౌకర్యాలను సమకూర్చడంలో రిజర్వేషన్లకు సంబంధించిన ఖాళీలను పూరించడం లో జరిగే మోసాలను, ఇతర రకాల దోపిడీలను బహిర్గతం చేయడం మొదలైంది. ఈ నిమ్నవర్గాలలోని మేధావి యువకులే ఈ రంగంలో పరిశోధన ప్రారంభించారు. వీరు ప్రధానంగా అంబేద్కర్ వల్ల కొంతవరకు జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఇక్కడి పెట్టుబడిదారీ వ్యవస్థలో మౌలికంగా ఉన్న దోపిడి ఆర్థిక వ్యవస్థయ దళితుల నికృష్టమైన జీవితాలకు బాధ్యత వహిస్తున్నదని అని వీళ్ళ అభిప్రాయం.
దళితుల సమస్యలు - పోరాటం ప్రధానంగా సాంఘికమైనవే! శూద్రుల పట్ల సవరణలు అవలంబిస్తున్న అమానుష వైఖరి ఈనాటికీ దేశంలోని మేధావులకు ఒక సవాలుగానే నిలిచి ఉంది. “ నూతన రాజ్యాంగం – సమానావకాశాలు “ అనే నినాదాలు ఉన్న మన మధ్యనే జీవించే తోడి సోదరుల పట్ల మనం చూపే తిరస్కారం - ఉపేక్షాభావం మనకే ప్రమాదంగా పరిణమించాయి. శూద్రుల పట్ల మన ఈ వ్యవస్థ ఈనాటిది కాదు. వేలాది సంవత్సరాల నుంచి వారిని నీచంగా - నికృష్టంగా చేసే మానసిక వైఖరిని మనలో ఆనాటి నుంచి నీచమైన సంస్కారంగా పాతుకుపోయింది. ఆధునికుల మనుకునే వారిలో కూడా ఈ అంతర్గత వైరుధ్యాలు ఆత్మవంచన చోటుచేసుకున్నాయి. ఈ అమానుష వ్యవహారాన్ని తరతరాలుగా సహించి - సహించి శూద్రులు ఒక విధంగా సంవేదనా శూన్యులై పోయారు. అయితే నూతనంగా లభించిన ప్రజాస్వామికమైన వ్యవస్థ - విద్యావకాశాలు వారిలో కొంతమంది నూతనంగా లభించిన ప్రజాస్వామికమైన వ్యవస్థ - విద్యావకాశాలు వారిలోని కొంతమంది యువకులను చైతన్యవంతులను చేశాయి. తమ అస్అస్తిత్వాన్ని గుర్తించి క్రమంగా సవర్ణులలో ఉన్న వైరుధ్యాలను ఎత్తి చూపించారు. మతం, చరిత్ర, సంస్కృతి, కర్మకాండ తదితర అంశాలను ప్రశ్నించారు. దీనివల్ల సవర్ణులు ఉక్రోషంతో తిరిగి నిమ్నజాతుల పై దాడి చేయడం ప్రారంభించారు. ఈ అత్యాచారాలను ఎదుర్కొంటూ దళిత వర్గాలు తిరిగి కొత్తగా పోరాటం సాగించాయి. తమ సాంఘిక అస్తిత్వం కోసం, గుర్తింపు కోసం వీళ్ళు జరుపుతూ వచ్చిన పోరాటాలు - తప్పనిసరిగా రక్త సిక్తం కాక తప్పలేదు.
దళిత వర్గాలు తమ స్వతంత్రమైన గుర్తింపు పోరాటం యొక్క చివరి శక్తివంతమైన రంగం సాహిత్య పరమైన అభివ్యక్తి! జీవితంలోనే ప్రతి రంగంలో శూద్రులు ఉపేక్షితులైనట్లే సాహిత్య రంగంలో కూడా తిరస్కృతులయ్యారు. గత వందలాది సంవత్సరాల నుంచి వస్తున్న సాహిత్యంలో సవర్ణులను కూడా మాత్రమే శక్తివంతంగా చిత్రించడం జరిగింది. సహజమైన మానవతా సందేశాన్ని ఇవ్వవలసిన సాహిత్యం కేవలం రెండు వర్ణాలకు సంబంధించిన జీవన అభివ్యక్తి గానే మిగిలిపోయింది. సాహిత్యంలో శూద్రుల్ని బానిసలుగా, బేస్తవాళ్ళుగా, ఉరితీసే వాళ్ళుగా వారి స్త్రీలను దాసీలుగా లేదా భోగించబడే వస్తువులుగా మాత్రమే చిత్రించడం జరిగింది. వాళ్లని మనుష్యులుగా చిత్రించనూలేదు, స్వీకరించనూలేదు. అందువల్ల ఇలాంటి సాహిత్యాన్ని తిరస్కరించి ఉపేక్షితులైన వ్యాపకమైన సహజ మానవత్వంతో ముడిపడి ఉన్నది. గొప్ప కులాల్లో ఉండే బలహీనతలను బట్టబయలు చేస్తూనే సహజమైన మానవత్వాన్ని ఈ సాహిత్యం కోరుకుంటున్నది. నిర్లక్ష్యం చేయబడిన వర్గాల పట్ల కరుణను సాహజమైన స్నేహాన్ని ఉద్దీపింపచేస్తున్నది. భాష, కథనం, శిల్పం మొదలైన విషయాలలో ఈ సాహిత్యం సాంప్రదాయం నుంచి భిన్నంగా ఉన్నందువల్ల మొదట్లో దీనిని అపహాస్యం చేసేవారు. కానీ ప్రగాఢమైన సంవేదన, విశిష్టమైన అభివ్యక్తి దృష్ట్యా ఈ సాహిత్యాన్ని స్వీకరింపక తప్పలేదు. ఒక విధంగా సాహిత్యానికి మూల ప్రేరణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది మహారాష్ట్ర వరకు చూసిన అతి ముఖ్యమైన వాస్తవం. మహారాష్ట్రలోని విభిన్న రంగాల్లో దళితులు ఎదుర్కొన్న కష్టాలు కేవలం సృజనాత్మక స్థాయిలోనే వ్యక్తం కాలేదు. పోరాటం, తిరుగుబాటు, నిరాకరణ ఈ మూడు స్థాయిలలో సాహిత్యేతరమైన ఉద్యమాలు పుట్టుక రాసాగాయి. అంబేద్కర్ నాయకత్వాన అంటరాని వాళ్ళకు సమాజంలో సమానత్వం కోసం జరిగిన పోరాటం వైపు సాహిత్యంలో దళిత సాహిత్యంగా ప్రతిస్పందించింది. ఈ దళిత సాహిత్య ఉద్యమం సాంఘిక పోరాటం నుంచి రావడం వల్ల అందులోనే అంతర్గత వైరుధ్యాలన్నీ ఈ సాహిత్య ఉద్యమంలో కూడా కనబడతాయి. మహారాష్ట్రలో సాంఘిక సంస్కరణ కు సంబంధించిన ఉద్యమాల దిశ మిగతా ప్రాంతాలకంటే కొంచెం భిన్నమైనది. ఉత్తర భారతదేశంలో జరిగినట్టే ఇక్కడ కూడా అంటరానివారి పట్ల దయ సానుభూతి హృదయ పరివర్తన అనే సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని ఉద్యమాలు నడిచిన హిందూ సమాజంలోని అతి క్రింద స్థాయిలోనే నిమ్న వర్గాలను సంఘటిత పర్చి మిగతా మూడు వర్ణాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని నడపడం ఇక్కడి ప్రత్యేకమైన అంశం.
నిమ్నవర్గాల ఉద్ధరణ కోసం మహారాష్ట్రలో మొదటిసారిగా గోవిందరావు ఫూలే ( 1827 – 1890 ) తిరుగుబాటుకు పిలుపునిచ్చాడు. సవర్ణుల మోసంతో కూడిన ఆధిపత్యం. నిమ్నవర్గాల అజ్ఞానం ఇక్కడి సాంఘిక వికృతాలకి మూలమని శ్రీపూలే భావించాడు. తన విప్లవాత్మకమైన కార్యాన్ని సాధించే నిమిత్తం 1874లో “ సత్యశోధక్ సమాజ్ “ అనే సంస్థను స్థాపించాడు. శ్రీ పూలే అభిప్రాయాలకు అన్ని విధాలా సహాయ పడిన వ్యక్తి కొల్హాపూర్ మహారాజు రాజర్షి షాహో మహారాజ్. ఆ తర్వాత ఈ ఇద్దరు వ్యక్తుల సాంఘిక ఉద్యమాల్ని డాక్టర్ అంబేద్కర్ తీవ్ర స్థాయిలో కొనసాగించాడు. ఆయన తన మృత్యువుకు పూర్వం బౌద్ధమతాన్ని స్వీకరించాడు. బౌద్ధమతం యొక్క త్రిపీఠకాలని తన ఉద్యమానికి సమన్వయింప చేశాడు . బుద్ధం శరణం గచ్చామి, దమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే మూడు సూత్రాలను ఈ విధంగా ఉద్భోదించాడు. బుద్ధం - విద్యావంతులు కండి ( Educate ), సంఘం - సంఘటితం కండి ( organise ) ధమ్మం - పోరాటానికి సిద్ధం కండి ( Agitate ). మహారాష్ట్రలోని దళిత సాహిత్యం తన పూర్వ రంగంలో ఈ మూడు సూత్రాలను స్వీకరించింది.
అంబేద్కర్ మృత్యువు తరువాత దళిత రచయితల మొదటి మహాసభ బొంబాయిలో జరిగింది. ఆనాటికి దళితుల పత్రిక “ ప్రభుద్ధ భారత్ “ తన సంపాదకీయంలో ఇలా రాసింది. – ఇక్కడి విచిత్రమైన సామాజిక వ్యవస్థకు విరుద్ధంగా దళితులు నిరంతరం తిరుగుబాటు చేయవలసి ఉంది. ఈ తిరుగుబాటు చరిత్రయే దళిత సాహిత్యం. అభ్యుదయ సాహిత్యోద్యమం అవగాహనలో ఆర్థిక విప్లవం సిద్ధించిన తర్వాతే సమానత సాధ్యం. అప్పుడే అన్ని రకాల సాంఘిక సమస్యలు పరిష్కారమవుతాయి. అంటరానివాళ్ళని అణచబడిన జాతుల భయంకరమైన దుస్థితికి కారణం ఆర్థిక అసమానతనే అని అంబేద్కరిస్టులు భావిస్తారు. ఇక్కడే మనం మార్క్స్ - అంబేద్కర్ భావాల మధ్య ఉండే విభేదాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. దళిత రచయితలు ఈ ఇద్దరి భావాలను నమ్ముతున్న రెండు దళాలు ముందుకు వచ్చాయి. కాబట్టి ఇది అవసరం అవుతున్నది. సనాతన హిందూ మనస్తత్వం ఆర్థిక దుస్థితి పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ మూడు కూడా అంటరానివాళ్ళ నికృష్ట స్థితికి ప్రముఖంగా బాధ్యత వహిస్తాయని వాళ్ళు చెబుతున్నారు. కానీ రెండో దళం మాత్రం కేవలం అంబేద్కర్ భావాలను మాత్రమే స్వీకరిస్తున్నది. భారతదేశంలో సవర్ణులు మార్క్స్ ను తమ స్వార్థానికి ఉపయోగించుకున్నారు కాబట్టి మార్క్స్ నిరుపయోగమైపోయాడని వీళ్ళ నమ్మకం.
దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ : 9493033534
Uploads